సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైంది.. మంత్రి కేటీఆర్

by Javid Pasha |
సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైంది.. మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరి ధాన్యం సాగులో పంజాబ్ ను మించిపోయిందని అన్నారు. నిజామాబాద్ పట్టణంలో కొత్తగా నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2004లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1200 అయిందని అన్నారు.

నాలుగొందలు నాలుగొందల తిట్లు తిట్టారని మంత్రి.. ఇప్పుడు రూ.1200 చేసిన వాళ్లను ఎన్ని తిట్లు తిట్టాలని అన్నారు. 70 రూపాయల పెట్రోల్ ను 120 రూపాయలు చేశారని కేంద్రంపై మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్లలో ఒక్క మంచి పనైనా చేశారని అని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

Advertisement

Next Story

Most Viewed