ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఊహించని రియాక్షన్

by Javid Pasha |   ( Updated:2023-10-21 17:30:38.0  )
ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఊహించని రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టుడే-సీ ఓటర్ శనివారం విడుదల చేసిన తెలంగాణ ఓపీనియన్ పోల్ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని ఈ సర్వే తేల్చేయగా.. అధికార బీఆర్ఎస్‌ భారీగా సీట్లను, ఓట్ల శాతాన్ని కోల్పోబోతుందని అంచనా వేసింది. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ సీట్లు 19 నుంచి 54కు పెరిగే అవకాశముందని వెల్లడించింది. మ్యాజిక్ ఫిగర్ 60 కాగా.. కాంగ్రెస్‌ చేరువలోకి వస్తుందని తెలిపింది.

రాష్ట్రంలో కీలకంగా మారిన ఈ సర్వేపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సర్వే రిపోర్ట్ చూసి ఆగం కావొద్దని, తమ నాయకులపై ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. ఎక్కువ స్థానాల్లో తామే గెలుస్తామని, బీజేపీకి ఒక్క సీటు రావడం కూడా డౌటేనని జోస్యం చెప్పారు. ఖమ్మంలో నాయకులు వేరే పార్టీలకు పోయినా ఎక్కువ స్థానాల్లో తామే గెలుస్తామని, కాంగ్రెస్‌తోనే తమకు పోటీ అని తెలిపారు. బీజేపీ పని ఖతం అయిందని, వారి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. తాము చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు 54 సీట్లు, బీఆర్ఎస్‌కు 49 వస్తాయని సీ ఓటర్ వెల్లడించింది. ఇక బీజేపీకి 8 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని, బీఆర్ఎస్‌కు 38 శాతం ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది. ఈ సర్వేను బట్టి చూస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కాస్త ఎడ్జ్ కనిపిస్తుండగా.. బీఆర్ఎస్‌ గ్రాఫ్ మాత్రం భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగా.. సీ ఓటర్ సర్వే ప్రకారం ఈ సారి అంతకంటే ఎక్కువ స్థానాలు రానున్నాయి. గత ఎన్నికల కంటే కాంగ్రెస్, బీజేపీ పుంజుకోగా.. వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్ హవా తగ్గిపోయినట్లు స్పష్టమౌతుంది.

Advertisement

Next Story

Most Viewed