చీమల‌పాడు ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-12 09:51:42.0  )
చీమల‌పాడు ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం చీమలపాడు అగ్నిప్రమాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కాగా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో బాణసంచా అంటుకుని గుడిసె కాలిపోగా, సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఆరుగురికి గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉంది.

ఇవి కూడా చదవండి: ఆత్మీయ సమ్మేళనానికి.... సిలిండర్ పేలటానికి సంబంధం లేదు

Advertisement

Next Story