దురదృష్టవశాత్తు అవి కేంద్రం చేతిలో ఉన్నాయి: కేటీఆర్

by GSrikanth |   ( Updated:2023-03-26 14:03:05.0  )
దురదృష్టవశాత్తు అవి కేంద్రం చేతిలో ఉన్నాయి: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్‌ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా రెండూ నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రజలు, వాహనదారుల సౌలభ్యం కోసం గ్రేటర్‌లో ప్లైఓవర్‌ల నిర్మాణం జరుగుతుందని ఈ రెండు నిర్మాణం జరుగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్‌లో సీఆర్డీపీ కింద 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, 12 ప్లైఓవర్లు పురోగతిలో ఉన్నాయన్నారు. కానీ కేంద్రం మాత్రం జాతీయ రహదారుల ద్వారా చేపట్టిన రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. ఇది కేంద్ర పనితీరుకు నిదర్శమని ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed