- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్: కేటీఆర్
దిశ, సికింద్రాబాద్: వ్యూహాత్మక రోడ్డు అభివృద్ది పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లతో పనులను పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం రూ.72 కోట్ల వ్యయంతో నిర్మించిన తుకారాంగేట్ రైల్వేగేట్ రోడ్డు అండర్ బ్రిడ్జిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శతాబ్ద కాలం నుండి తుకారాం గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఆర్‌యూబీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు రవాణా ఇక్కట్లు తొలిగిపోతాయన్నారు. సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను చేపట్టి ప్రజల ట్రాఫిక్ సమస్యలు అధిగమించడం జరిగిందని తెలిపారు. నగరంలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో రైల్వే లైన్ ఉన్నందున ప్రజలకు అవసరమైన చోట అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను చేపట్టేందుకు ఇటీవల రైల్వే ఉన్నతాధికారులతో పిలిపించి చర్చించామన్నారు.
ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను ఇప్పటికే చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ.. తుకారాంగేట్ రైల్వేగేట్ వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, ప్రజల చిరకాల వాంఛగా ఉండేదని, మంత్రి కేటీర్ సారథ్యంలో ప్రజల వాంఛ నెరవేరిందన్నారు. ఉద్యమ కాలంలో కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నామని గుర్తుచేశారు. అడ్డగుట్ట యువత సహకారంతో తిరిగి అక్కడ నుండి గమ్యస్థానానికి చేరుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు అమలు చేస్తున్నారని మార్చి, ఏప్రిల్ మాసంలో అధిక మొత్తంలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ అండర్ బ్రిడ్జితో మల్కాజిగిరి, మారెడ్‌పల్లి, మెట్టుగూడ, లాలాపేట్ ట్రాఫిక్ రద్దీ తగ్గిస్తుందని అంతేగాకుండా మౌలాలి, మల్కాజిగిరి, తార్నాక సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుందన్నారు.