16 ఏళ్లుగా నాకు ఆ వ్యాధి ఉంది.. మీడియాతో కేటీఆర్!

by GSrikanth |   ( Updated:2022-03-05 12:04:13.0  )
16 ఏళ్లుగా నాకు ఆ వ్యాధి ఉంది.. మీడియాతో కేటీఆర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గత 16 ఏళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ మీటింగ్స్, ఐటీ కంపెనీలతో మీటింగ్స్‌లో పాల్గొంటూ నిత్యం బిజీబిజీగా ఉంటే కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో షుగర్ వ్యాధి గురించి రివీల్ చేశారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పరీక్షలు చేసుకోవడం ద్వారానే తనకు షుగర్ ఉందని తెలిసిందని, ఆరోగ్య తెలంగాణయే లక్ష్యంగా ఇంటింటికి వచ్చి వైద్య బృందం పరీక్షలు చేస్తారని కేటీఆర్ వెల్లడించారు. రాబోయే 60 రోజుల్లో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తెలుసుకునేలా.. హైట్, వెయిట్, బీపీ, షుగర్, హార్డ్, కిడ్నీ ఇలా అన్ని రకాల టెస్టులను చేసి వారి డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed