- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ కష్టాలకు.. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో పాటు అభివృద్ధి (ఎస్ఆర్‌డీపీ) పనులపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. నగరంలో ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయిందని, రోడ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు జరగకపోవడంపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. రోడ్లపై ఉన్న గుళ్లు, మసీదులు, చర్చీలు ట్రాపిక్‌కు కొన్ని చోట్ల ఇబ్బందికరంగా మారాయన్నారు. అలాంటి బాటిల్ నెక్ పాయింట్ల దగ్గర ఎంతగా కంట్రోల్ చేసినా ఇరుకైన ప్రాంతం కావడంతో చాలా సమయం పడుతుందన్నరు. నిజానికి ఇలాంటివి సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలను, విశాల కోణం నుంచి ఆలోచించి సహకారం అందిస్తే పరిష్కారం దొరుకుతుందన్నారు.
నిజానికి దుమ్ము, ధూళి మధ్యలో ఉండాలని ఏ దేవుడూ కోరుకోరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భక్తులు కూడా అలానే ఆలోచిస్తారని అన్నారు. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్ల నిర్మాణం కోసం ప్రార్థన మందిరాలపై చట్టం తెచ్చారని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణలోసైతం అలాంటి చట్టం గురించి పరిశీలిస్తామన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. పెరిగిపోతున్న నగర విస్తీర్ణం, దానికి అనుగుణంగా ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చే వలసలు, జనాభా అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి సవాలు వంటిదన్నారు. ప్రజలు పెరిగినాకొద్దీ వాహనాలు పెరుగుతాయని, దానికి తగినట్లుగా రోడ్ల విస్తరణ చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వం ఎంతగా ఆలోచిస్తున్నా కొన్ని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. రోడ్ల విస్తరణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని, తగిన స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కేంద్ర రక్షణశాఖకు విజ్ఞప్తి చేసిందని, కానీ ఆశించిన సహకారం రాకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదన్నారు. రక్షణ శాఖకు చెందిన భూములు లభిస్తే రోడ్లను విస్తరించడం వీలవుతుందని, ట్రాఫిక్ సమస్యలు తొలుగుతాయన్నారు. ఒకవైప రోడ్లమీద ప్రార్థనా మందిరాలు, మరోవైపు కేంద్రం నుంచి సహకారం లేకపోవడంతో నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ కష్టసాధ్యంగా మారిందన్నారు. రోడ్ల మీద ప్రార్థనాలయాలను నియంత్రించడం లేదా తొలగించడానికి సంబంధి,చి ఒక చట్టం చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.