క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ కాదు కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-16 14:49:54.0  )
క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ కాదు కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా కేటీఆర్ క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ మహిళా సమాజానికి కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రేక్ డ్యాన్సులకు అలవాటుపడిన వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. కాగా, మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్లను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించారు. అంతేకాదు.. కేటీఆర్ కామెంట్లను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించింది. కేటీఆర్ కామెంట్లు తెలంగాణ మహిళలను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ మహిళా కమిషన్ పేర్కొంది. ఈనెల 24న విచారణకు హాజరు కావాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దీంతో ‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని సోషల్ మీడియాలో(ఎక్స్) కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story
null