- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాత్రిపూట ఆ వాహనాలను అనుమతించకండి.. అధికారులకు మంత్రి ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు(Wildlife Conservation Board) 8వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అటవీ ప్రాంతాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన నాలుగు మొబైల్ టవర్లు, ఇతర ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కవాల్ టైగర్ రిజర్వు(Kawal Tiger Reserve) యొక్క బఫర్ ఏరియాలో పంచాయతీ రోడ్ల నిర్మాణం కోసం సవరించిన ప్రతిపాదనలు ఆమోదం తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ సెల్ ఫోన్ టవర్లు అంశంలో ఈ ఐదు ప్రతిపాదనపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు.
గిరిజనుల తరలింపు(Tribals Migration) ఎలా చేస్తున్నారో ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తే.. 1/70 కింద కలిగే ప్రయోజిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. సంబంధిత చట్ట ప్రయోజిత ప్రాంతంలోకే తరలిస్తున్నట్టు అధికారులు వివరించారు. అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణాలను రక్షించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాత్రిపూట హెవీ వెహికిల్స్‌ను అటవీ రోడ్ల నుంచి అనుమతి ఇవ్వొద్దని సూచించారు.
నియమ నిబంధనలు అధ్యయనం చేసి, వాహనాల రాకపోకల సమాయపాలనపై నిబంధలు అవసరం అయితే సవరించాలని మంత్రి సలహా ఇచ్చారు. పరిశీలిస్తామని అటవీ, పర్యావరణ శాఖ అధికారులు మంత్రికి బదులు చెప్పారు.