Komatireddy Venkat Reddy: ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేటీఆర్ కుట్ర

by Gantepaka Srikanth |
Komatireddy Venkat Reddy: ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేటీఆర్ కుట్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో కోమటిరెడ్డి మాట్లారు. మాజీ ఎమ్మెల్యేతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేటీఆర్‌(KTR) ప్లాన్‌ చేశారని మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతోందని.. త్వరలో అందరి పేర్లు బయటకు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు పంపించామని బీఆర్ఎస్(BRS) నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

అవాస్తవాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ నేతలను మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పులో ఉంది. నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని అన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. వికారాబాద్‌(Vikarabad)లోనూ మాజీ ఎమ్మెల్యేతో ప్లాన్‌ చేసి కలెక్టర్‌పై దాడి చేయించారని తెలిపారు. సురేష్‌ బీఆర్ఎస్ కార్యకర్త అని కేటీఆరే అన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed