- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ తన పాలనలో ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమన్నారు.