Komatireddy: ఆ మాట కేటీఆర్‌ నోట్లోంచి వింటుంటే నవ్వొస్తుంది

by Gantepaka Srikanth |
Komatireddy: ఆ మాట కేటీఆర్‌ నోట్లోంచి వింటుంటే నవ్వొస్తుంది
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవనాలనే హైడ్రా కూల్చుతోందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జన్వాడ ఫామ్‌హౌజ్‌ను సైతం కూల్చివేస్తారు. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. అక్రమంగా జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌజ్ నిర్మించారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని.. ఇక నుంచి బీఆర్ఎస్‌ను కూడా బీజేపీనే అని పిలవాలని ఎద్దేవా చేశారు. అతి త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని అన్నారు. కేటీఆర్‌ను చూస్తే జాలి వేస్తోందని విమర్శించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. రేపటి బీఆర్ఎస్ ధర్నాకు వెయ్యి మంది కూడా రారని అన్నారు.

Advertisement

Next Story