- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పొలం బాట కాదు.. తీహార్ జైలు బాట పట్టాలి: కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆదివారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అక్రమ ఆస్తులపై చట్టం తన పని తాను చేస్తుకుంటూ వెళ్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిడ్ మానేరు కాంట్రాక్ట్‌తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు సంబంధం ఉందని నిరూపించకపోతే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిడ్ మానేరు కాంట్రాక్ట్ హరీష్ రావే చేశారని తెలిపారు. ఇక కేసీఆర్ పొలం బాట కాదని.. తీహార్ జైలు బాట పట్టాలని కీలక సూచించారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంలలో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రం నుంచి 28 కిలోమీటర్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా బుల్లెట్ నడిపారు.