- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగుళూరులో ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ.. టీ-కాంగ్రెస్‌లో కొత్త చర్చ..!
దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఖర్గే పుట్టిన రోజు కావడంతో బెంగుళూరులోని ఆయన నివాసంలో కలిసి కోమటిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఖర్గేతో సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో వస్తున్న స్పందన గురించి ఖర్గేకు వివరించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో ఉండగా.. కోమటిరెడ్డి మాత్రం ఒంటరిగా బెంగళూర్ వెళ్లి ఏఐసీసీ చీఫ్‌తో భేటీ కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి లాబీయింగ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా.. అలాంటిదేమి లేదని కేవలం ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిందుకే కోమటిరెడ్డి బెంగుళూరు వెళ్లారని మంత్రి అనుచరులు పేర్కొంటున్నారు.