Minister Komatireddy: పుష్ఫ-2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-12-06 16:20:21.0  )
Minister Komatireddy: పుష్ఫ-2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 (Pushpa-2) బెనిఫిట్ షో (Benifit Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో (Benifit Show)లు వేసేందుకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు. సిటీ నడిబొడ్డున బెనిఫిట్ షో (Benifit Show)లు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబంతో సరదాగా మూవీ చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు .

కాగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మికా మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ (Hyderabad)లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద విషాదం చోటుచేసుకుంది. అయితే, ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ (Allu Arjun) అక్కడి రాగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే, బెనిఫిట్ షో (Benifit Show) చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar) నుంచి రేవతి (39), భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్ (9), సన్వీక (7) సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి, కుమారుడు శ్రీతేజ్ ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన పోలీసులు రేవతికి సీపీఆర్ (CPR) చేసినా లాభం లేకపోవడంతో ఆమెను విద్యానగర్‌లోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే రేవతి ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

Read More...

Pushpa -2: థియేటర్లలో పుష్పరాజ్ రప్పా రప్పా.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?


Next Story