అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కిషన్ రెడ్డి...

by Kalyani |
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కిషన్ రెడ్డి...
X

దిశ, కార్వాన్ : అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా, కార్పొరేటర్లుగా, మజ్లీస్ పార్టీ నేతృత్వం వహిస్తున్నదని హిందూ బెల్ట్ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కూడా ప్రజలకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి డివిజన్లోని డి క్లాసులో కమ్యూనిటీ హాల్, ఆసిఫ్ నగర్ డివిజన్ లోని దయాబాగ్ జి ప్లస్ వన్ కమ్యూనిటీ హాల్, తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సుమారు 78 లక్షల వ్యయంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మజిలీస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతగా నాంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా అనేక పనులు చేస్తున్నామని తెలిపారు.

నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సహాయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. అందుకోసం బస్తీ నాయకులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాదు నగరంలో జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లకు నిధుల కొరత వేధిస్తున్నదని, కనీసం వీధిలైట్లు హ్యాండిల్ చేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వడం లేదని దీంతో సమ్మెకు దిగారని తెలిపారు. నగరంలోని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అంబర్పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, గోషామహల్ వంటి ప్రాంతాల్లో ని బస్తీలలో నిధుల కొరతతో ప్రజలకు అన్యాయము జరుగుతున్నదని చెప్పారు. జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లకు నిధుల కొరతతో అరకొర సౌకర్యాలతో పాఠశాలలు నడుస్తున్నాయని ఆయన విమర్శించారు. నిధులు కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బిజెపి సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ దివంగత దేవర కరుణాకర్ 60వ జయంతి సందర్భంగా గుడిమల్కాపూర్ డివిజన్లో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. అనంతరం జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి, మిఠాయిలను పంచిపెట్టారు. మెమొంటోలను కూడా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవర శ్రీనివాస్, దేవర వంశీ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

Next Story

Most Viewed