Minister Jupally: హరిత హోటళ్లు మూతపడటానికి కారణం గత సర్కారే.. మంత్రి జూపల్లి హాట్ కామెంట్స్

by Shiva |
Minister Jupally: హరిత హోటళ్లు మూతపడటానికి కారణం గత సర్కారే.. మంత్రి జూపల్లి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న హరిత హోటళ్లు మూతపడటానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమేనని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఆరోపించారు. ఇవాళ హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)‌లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్‌ (Adventure Water Sports)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కేరళ (Kerala) తరహాలో రానున్న రోజుల్లో తెలంగాణ టూరిజాన్ని (Telangana Tourism) అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నదీ జలాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)లోని జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయని.. వాటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. టూరిజాన్ని గత ప్రభత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 హరిత హోటళ్లు (Harith Hotels) పూర్తిగా మూత పడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వ వనరులను ప్రైవేటు వాళ్లకు లీజుకు ఇస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed