- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగు గ్యారంటీల అమలుపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీని కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే బీఆర్ఎస్ను తరిమి కొట్టారని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని.. అందులో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందనందుకే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని అన్నారు. గతంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. రెండేళ్ల పసికందును విమర్శిస్తారా? అని వాపోయినట్లు గుర్తుచేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలకే విమర్శలు ప్రారంభించారని మండిపడ్డారు. 2014లో బంగారు పళ్లాన్ని ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే.. అప్పుల కుప్పగా మార్చాడని విమర్శించారు. రహస్యంగా జారీ చేసిన ఎన్నో జీవోలను బీఆర్ఎస్ బహిర్గతం చేయలేదని అన్నారు. తొమ్మిదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీకే పోతోందని అన్నారు. బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని వెల్లడించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు అమలు చేశామని.. మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పూర్తికాగానే దశలవారీగా మిగిలిన వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.