ప్రజల ముందు బీజేపీ నేతలు దోషులుగా నిలబడాల్సిందే: మంత్రి

by GSrikanth |
ప్రజల ముందు బీజేపీ నేతలు దోషులుగా నిలబడాల్సిందే: మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ సంపదను కేంద్రం ఒకరిద్దరికే కట్టబెట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు దేశ ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిందే అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రంలోని రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను ఆపబోమని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు సీఎం కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌ అందించడం కేంద్రానికి కంటగింపుగా మారిందని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం పన్నుతున్న దుర్మార్గమైన ఆలోచనను పూర్తిగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Next Story