వర్షాలు పడుతున్నాయ్.. జాగ్రత్త: అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి కీలక సూచన

by Satheesh |
వర్షాలు పడుతున్నాయ్.. జాగ్రత్త: అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సచివాలయంలో తన చాంబర్‌లో విద్యుత్ సంస్థ సీఎండీలతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వానలు పడుతున్నాయని, సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన నష్టాలపై మంత్రి సీఎండీలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో విద్యుత్ శాఖ ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈదురు గాలులతో చెట్లు విరిగి స్తంభాలపై పడడంతో వైర్లు తెగిపడడం వంటి వాటిపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed