TSPSC పేపర్ల లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-03-21 09:57:50.0  )
TSPSC పేపర్ల లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత వారం రోజులుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్పీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై అటు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూంటే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పేపర్ లీక్‌లు సర్వ సాధారణంగా జరిగేవే అంటూ ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపారేశారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతా ఉంటాయని కూడా మంత్రి చెప్పుకొచ్చారు.

గతంలో టెన్త్, ఇంటర్ పేపర్లు కూడా లీకయ్యాయి అనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీంతో మంత్రి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు, పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ దోషి అనడం సరి కాదని, సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలనడంలో అర్థం లేదని అన్నారు. ఇక పేపర్ లీకేజీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ గ్రామంలో అధిక మార్కులు వచ్చిన వారి జాబితా సమర్పించాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed