- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి: వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ లీకేజీ అంశం సర్వసాధారణం అని బాధ్యత లేని మాటలు మాట్లాడిన రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం (వీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి మతిలేని మాటలు మానుకోవాలని, తన సొంత నియోజకవర్గం నిర్మల్ జిల్లా కేంద్రంలో గల మున్సిపాలిటీ లో 42 ప్రభుత్వ ఉద్యోగాలను సైతం అసలైన అర్హులకు ఇవ్వకుండా అమ్ముకున్న చరిత్ర ఆయనది అని ఆరోపించారు.
లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు ఖర్చు చేసుకుని, ఏళ్ల తరబడి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ, కొట్లాడితే అరకొర ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేస్తే, తీరా ఇప్పుడు వాటిని కూడా లీక్ చేసి పైసలా కోసం తెలంగాణ లో పరీక్ష పేపర్ లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇవి తెలియని మంత్రి కేసీఆర్, కేటీఆర్ల మెప్పు కోసం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులకు అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే బేషరతుగా మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదు అని హెచ్చరించారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఏ లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.