- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్ర వివక్ష కొనసాగుతూనే ఉంది.. మంత్రి హరీశ్‌రావు ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీశ్‌రావు తప్పు పట్టారు. రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉందని, రాష్ట్రంపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపిందని, అక్రమ బదలాయింపుతో తెలంగాణ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైకోర్టు విభజన చేయకుండా ఐదేళ్లు జాప్యం చేసిందని, విభజన హామీలు అమలు చేయడం లేదని, బిడ్డను బతికించారు అంటూ కేంద్ర పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్‌పై అన్యాయం చేసిందని, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై నీతి అయోగ్ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపు ఇవ్వడం లేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి అతీగతీ లేదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ. 495 కోట్లను ఏపీ ఖాతాలో జమ చేసిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుకు విద్యుత్ సంస్కరణకు లంక పెట్టిందని, విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడంతో ఐదేండ్లలో రూ. 25 వేల కోట్లు తెలంగాణ నష్టపోయిందని, కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు.