- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు.. ఆరు నెలలకో CM గ్యారెంటీ: మంత్రి హరీష్ రావు సెటైర్
దిశ, బొమ్మలరామారం: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంత్రి హరీష్ రావు ఆలేరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఐదు గంటల కరెంట్ చాలని డీకే శివకుమార్ అంటున్నాడు.. మరీ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని ప్రశ్నించారు. కర్నాటకలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు బంధు, స్కాలర్ షిప్ ఆగిపోయిందని.. మాట ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు పత్తాలేరని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అంటున్నారు.. ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు.. ఆరు నెలలకో సీఎం గ్యారెంటీ అని సెటైర్ వేశారు. కాంగ్రెస్ మాటలకు కరిగిపోతే పదేళ్లు వెనక్కిపోతామన్నారు. కర్నాటక రిస్క్‌లో పడింది.. ఇప్పుడు తెలంగాణ అలా కావొద్దంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో రూపాయకి 80 పైసల పనులు చేసుకున్నాం, ఒకటో రెండో చేయాల్సిన పనులు ఉన్నాయి.. ఆ పనులు కూడా తప్పకుండా చేసుకుందామని అన్నారు. మంగళవారం పొద్దునే యాసంగి సీజన్ రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.