- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డికి హార్స్ పవర్ అంటే ఏంటో తెలుసా..? మంత్రి హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. ఆదివారం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ కండువా కప్పి హరీష్ రావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు కరెంట్ 5 గంటల కరెంట్ చాలని అబాసుపాలయ్యారని అన్నారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు, ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా అని అన్నారు. వ్యవసాయానికి ఎంత హార్స్ పవర్ ఉన్నా మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్, ఇక్కడ 15 వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కానీ కేసీఆర్ గెలిస్తే 16 వేలు రైతు బంధు ఇవ్వటం ఖాయమన్నారు. కేసీఆర్ హయంలో తెలంగాణలో పల్లెల్లో కరువు లేదు, హైదారాబాద్‌లో కర్ఫ్యూ లేదు లేదన్నారు. 11 సార్లు అవకాశం ఇచ్చిన కనీసం బిందె నీళ్ళు ఇవ్వని కాంగ్రెస్, మళ్లీ వంద అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌ను భూతులు తిడుతున్నారని, మాకు తిట్టడం చేతకాక కాదన్నారు. తిట్టడం మొదలుపెడితే రేపటి వరకు తిడుతామని, కానీ మాకు సంస్కారం ఉందని అన్నారు.