- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Harish Rao: 4 రోజుల ముందే బండి సంజయ్‌కి ఆ విషయం ఎలా తెలుసు..?
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగు రోజుల క్రితమే అన్నారని.. ఈడీ నోటీసుల విషయం నాలుగు రోజుల ముందే బండి సంజయ్‌కి ఎలా తెలుసని ప్రశ్నించారు.
కాగా, 2021లో సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19వ తేదీన ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.