- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలో శ్వాస ఉన్నంత వరకు ఆయనకు రుణపడి ఉంటా: మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: నాలో శ్వాస ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌కు సిద్దిపేట ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో తలపెట్టిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ మాట్లాడుతూ.. బుల్లెట్ వేగంతో సిద్దిపేట రైలు మార్గాన్ని పూర్తి చేశామని తెలిపారు. సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో దశాబ్దం క్రితం కరువు తాండవించిందని.. కానీ ప్రస్తుతం 10 రాష్ట్రాలకు తెలంగాణ అన్నం పెడుతుందన్నారు.
సిద్దిపేటకు గోదావరి నీళ్లు ఇచ్చి సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ రైతుబిడ్డ కేసీఆర్ ఇప్పటికీ వ్యవయసాయం చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల్లో కేసీఆర్ ధైర్యం నింపారని కొనియాడారు. తెలంగానలో వేసవి కాలం కూడా వర్షాకాలం మాదిరే ఉందని.. వేసవిలోనూ చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయని అన్నారు. సిద్దిపేటలో కరువు అనే పదాన్ని కేసీఆర్ శాశ్వతంగా తొలగించారని చెప్పారు.