ఆ 9 కాలేజీల పనులు వేగంగా పూర్తి చేయాలె.. మంత్రి హరీష్ రావు

by Javid Pasha |
ఆ 9 కాలేజీల పనులు వేగంగా పూర్తి చేయాలె.. మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల పై శనివారం ఎంసీ హెచ్ ఆర్ డీ లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్​ మాట్లాడుతూ..9 మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 67 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్ లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రోవిసనల్ మెరిట్ లిస్టు విడుదల చేసి, 10 రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కౌన్సిలింగ్ నిర్వహించి 9 మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించాలన్నారు. 9 మెడికల్ కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్, పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. 9 కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్దం చేయాలని ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని, ఈ నెల 28న 9 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రిన్సిపాల్స్, ఇంజినీర్లతో పురోగతిపై వీసీ నిర్వహించాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed