రూ. 50 కోట్లకు పీసీసీ పోస్ట్.. అసెంబ్లీ టికెట్‌కు రూ.5 కోట్లు: మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-10-28 12:35:26.0  )
రూ. 50 కోట్లకు పీసీసీ పోస్ట్.. అసెంబ్లీ టికెట్‌కు రూ.5 కోట్లు: మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లతో టీపీసీసీ చీఫ్ పదవి కొనుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఒక్కొ టికెట్‌ను రూ.5 కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లలో అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనే లేదన్నారు. సొంత నియోజకవర్గంలో గెలవని నేతలు.. మాపై పోటీ చేస్తాననడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. టికెట్ అమ్ముకునే వాళ్లకు అధికారం ఇస్తే.. వాళ్లు రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారని అన్నారు. ఓటుకు నోటు దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెడదామా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed