కేసీఆర్ ఇచ్చిన స్ట్రోక్‌తో విపక్షాలు గిలగిల: T. Harish Rao

by GSrikanth |   ( Updated:2023-08-03 07:52:15.0  )
కేసీఆర్ ఇచ్చిన స్ట్రోక్‌తో విపక్షాలు గిలగిల: T. Harish Rao
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం వరుసగా ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్‌లతో ప్రతిపక్షాలు గిలగిల కొట్టుకుంటున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ, ఆర్టీసీ విలీనం, వీఆర్ఏలపై ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు ఊహించలేదని అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు ఐఆర్‌తో పాటు పీఆర్సీ ప్రకటన చేస్తామన్నారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీశ్ రావు.. కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రతిక్షాల వాయిస్ డౌన్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వరుస హామీల అమలు నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ లాంటిదని సభలో కూడా విపక్షాలను కడిగేస్తామన్నారు.

Read More : బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే..! కేసీఆర్‌పై ఈటల పోటీ?

Advertisement

Next Story