ధాన్యం సేకరణకు ఎఫ్సీఐ సహకారం అందించాలి.. మంత్రి గంగుల కమలాకర్

by Javid Pasha |
ధాన్యం సేకరణకు ఎఫ్సీఐ సహకారం అందించాలి.. మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో సీఎంఆర్ అందించడానికి సంపూర్ణంగా సిద్దంగా ఉన్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై అడిషనల్ కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఎంలు, ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణను మలిచి రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు రైతాంగానికి 1 కోటి 21 లక్షల కోట్లను ధాన్యం సేకరణ ద్వారా అందజేశామన్నారు. యాసంగి ధాన్యం సేకరణలో దేశంలోనే నెంవన్‌గా ఉన్నామన్నారు. రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు సమాయాత్తమవ్వాలని అధికారులకు సూచించారు.

విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన సేవల్ని పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఐవీఆర్ఎస్ నెంబర్ 799712345 ను మంత్రి గంగుల ప్రారంభించారు. వీటి ద్వారా కొత్త ఎఫ్ఎస్‌సీ కార్డుల సమస్యలు, పోర్టబులిటీ వీలు కలుగుతుంది. ఈ అప్లికేషన్ రూపకల్పనలో కృషి చేసిన ఎన్ఐసీ ఉద్యోగులను అభినందించి మెరిట్ సర్టిఫికెట్లను మంత్రి గంగుల కమలాకర్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల కమిషనర్ వి. అనిల్ కుమార్, ఎఫ్‌సీఐ డీజీఎం కిరణ్ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed