వివాదంలో మంత్రి ఎర్రబెల్లి.. బీఆర్ఎస్ పార్టీ పేరునే మార్చేసి.. (వీడియో)

by Nagaya |   ( Updated:2022-10-06 05:49:09.0  )
వివాదంలో మంత్రి ఎర్రబెల్లి.. బీఆర్ఎస్ పార్టీ పేరునే మార్చేసి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి విమర్శల పాలయ్యాడు. టీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉంటూ మంత్రిగా కొనసాగుతున్న ఆయన సీఎం కేసీఆర్ నూతనంగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ పేరును మార్చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సభా వేదికపై ప్రసంగించిన ఎర్రబెల్లి.. నరకాసుర వధ గురించి మాట్లాడుతూ మంచి పని చేయడానికి సీఎం కేసీఆర్ దసరా రోజు భారతీయ.. బీఎస్పీ పార్టీ ప్రకటించారని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. మంత్రిగా ఉన్న దయాకర్ రావు కనీసం కేసీఆర్ ప్రకటించిన పార్టీ పేరు కూడా తెలియదా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ ఎర్రబెల్లిని ట్రోల్ చేస్తున్నారు. కాగా, గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి బహిరంగంగా వివాదస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. సభా వేదిక మీదనే ఓ మహిళా ఎంపీడీఓను 'అక్కడ ఊపినావ్ గానీ.. ఇక్కడ ఊపడం లేద'ని కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వీడియోను మీరూ చూడండి..!


Advertisement

Next Story

Most Viewed