- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తాం: మంత్రి దామోదర
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఉద్యోగులంతా సమర్ధవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామన్నారు. మెడికల్ అండ్ హెల్త్ శాఖ ఉద్యోగులు ప్రజలకు నిరంతరం నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలలో వైద్యారోగ్య శాఖలోని గెజిటెడ్ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారని మంత్రి వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధికారులు రూపొందించిన డైరీ క్యాలెండర్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కలిముద్దీన్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, కోశాధికారి చంద్రశేఖర రావు, అసోసియేషన్ నాయకులు నరసింహారెడ్డి, నామాల శ్రీనివాసులు, మంజుల, విజయనిర్మల , రాజ్ కుమార్, చిట్టిబాబు, మురళీధర్ రెడ్డి తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.