జీవోలు ఇస్తే కాలేజీలు తెచ్చినట్టు కాదు : హరీష్ రావుపై మంత్రి దామోదర రాజనర్సింహా ఫైర్

by M.Rajitha |
జీవోలు ఇస్తే కాలేజీలు తెచ్చినట్టు  కాదు : హరీష్ రావుపై మంత్రి దామోదర రాజనర్సింహా ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘జీవోలు ఇచ్చి చేతులు ఎత్తివేయడం డెవలప్ మెంటా..?ఎన్నికల కోసం మెడికల్ కాలేజీలపై హాడావిడి చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ విజిట్ తర్వాత మీ డొల్లతనం బయట పడింది”అంటూ మంత్రి దామోదర రాజనర్సింహా హరీష్ రావు మీద ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ది కోసం ఎన్నికలకు ముందు జీవోలు విడుదల‌ చేసినంత మాత్రాన కాలేజీలు రావని ఎమ్మెల్యే హరీష్​ రావుకు కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన జీవోల్లో అంకెలు తప్పా, కాలేజీలు నడిపేందుకు కనీస సౌకర్యాలు లేవని మంత్రి ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 2024–25 అకాడమిక్ ఇయర్ లో దరఖాస్తు చేసిన 8 మెడికల్ కాలేజీల్లో కనీసం ఒక్క ప్రొఫెసర్‌ను కూడా నియమించలేదన్నారు. కాలేజీలకు బిల్డింగ్‌లు ఏర్పాటు చేయలేదన్నారు. అవసరమైన ఎక్విప్‌మెంట్ కొనలేదన్నారు. కాలేజీలకు అనుబంధంగా 220 బెడ్ల హాస్పిటల్స్ అవసరమైతే, కనీసం ఒక్క బెడ్డు కూడా గత ప్రభుత్వం వేయలేదని స్పష్టం చేశారు. అప్పటికే అందుబాటులో ఉన్న వంద బెడ్ల దవఖాన్లనే ఎన్‌ఎంసీకి చూపిస్తే, ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన ఎన్‌ఎంసీ అధికారులు అశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవసరమైన నిధులు కేటాయిచి, వంద బెడ్ల దవాఖాన్లను, నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా 220 బెడ్ల దవాఖాన్లుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ నాశనం చేసిన‌ వ్యవస్థను గాడిన పెట్టేందుకు జనరల్ ట్రాన్స్‌ఫర్లు చేశామని మంత్రి దామోదర వివరించారు.

గొప్పల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆటలు..

గతంలో ఒక్క ప్రొఫెసర్‌ను కూడా నియమించని కాలేజీల్లో, సరిపడా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లను, ప్రొఫెసర్లను నియమించామని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ల్యాబొరేటరీలు, డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్ సమకూర్చామన్నారు. కాలేజీ నడిపేందుకు అవసరమైన బిల్డింగ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ తాము చేశాం కాబట్టే ఈరోజు కాలేజీలకు అనుమతులు వచ్చాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇవే కాకుండా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన కాలేజీల్లోనూ కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. గుడ్డెద్దు చేలోపడ్డట్టు కాలేజీల ఏర్పాటుకు జీవోలు ఇస్తూ పోయారని విమర్శించారు. నాణ్యమైన మెడికల్ విద్యను నాసిరకంగా తయారు చేశారన్నారు. నేతల గొప్పల కోసం విద్యార్థుల భవిష్యత్తును, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాశనం చేసిన వ్యవస్థను తాము గాడిన పెడుతున్నామన్నారు. కాలేజీలకు, హాస్పిటళ్లకు బిల్డింగులు నిర్మిస్తున్నామ్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయబోతున్నామని వెల్లడించారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ చేయలేకపోయినా ఉస్మానియా కొత్త దవాఖానను నిర్మించబోతున్నామని స్పష్టంచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో హాస్టల్ బిల్డింగుల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని, గాంధీ కాలేజీ విద్యార్థుల కోసం హాస్టల్ బిల్డింగ్ సాంక్షన్ చేశామన్నారు.ఇప్పటికైనా రాజకీయాల కోసం అబద్దాలు, అసత్యాలు చెప్పడం బంద్ చేయాలని బీఆర్ ఎస్ నేతలకు మంత్రి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed