- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో రెండు స్థానాలపై ఎంఐఎం ఫోకస్.. ఎన్నికల వేళ ఓవైసీ ట్విస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం కీలక ప్రకటన చేసారు . 365 రోజులు ప్రజల మధ్యలో ఉండటమే మా ఎజెండా మేనిఫెస్టో అని అయన పేర్కొన్నారు . ఎంఐఎం పార్టీ. కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా పార్టీ ఆఫీసులో నేరుగా ప్రజలను కలవడమే తమ మేనిఫెస్టోలో ప్రధాన అంశమంటూ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు . సాధారణంగా పాతబస్తీలో ఏ చిన్న కార్యక్రమం అయినా, చివరికి చావు బతుకులు జరిగినా ఎంఐఎం నేతలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
చిన్న నేత నుంచి ఎంపీ స్థాయి వరకు అంతా వెళ్లికి హాజరవుతామన్నారు. ప్రజలు పిలవడమే ఆలస్యం వెంటనే అక్కడికి చేరుకుంటారు. పెళ్లి వేడుకలకు సైతం పిలిచినా, పిలవకపోయినా వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తుంటారని ఆసద్ మొదటి హామీగా ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా అదుకునేందుకు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు వెంటనే అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఎంపీ వెల్లడించారు. ఇలా నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నం దేశంలో ఏ పార్టీ చేయదని అని చెప్పారు .
తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెబుతామని ఆ పార్టీ నేత ఆసద్ భరోసా ఇచ్చారు. అయితే ఎంఐఎం మేనిఫెస్టో చూసిన రాజకీయ పార్టీలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు . సాధారణంగా ఎన్నికలు సమీపిస్తే చాలు అనేక హామీలు, ఎన్నో వాగ్ధానాలతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ హామీలు నచ్చితే జనాలు ఆయా పార్టీలకు ఓట్లు వేస్తుంటారు. కానీ కేవలం ప్రజల్లోనే ఉంటామంటూ.. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మేనిఫెస్టో ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. జనానికి ఏం చేస్తారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచి ప్రజా ప్రతినిధి ఎవరైనా సరే.. జనంలో ఉండాల్సిందే కదా అని పెదవివిరుస్తున్నారు .
ఏడింటితో పాటు మరి రెండు స్థానాలపై దృష్టి
పాతబస్తీలో తాము కచ్చితంగా గెలిచే 7 స్థానాలతో పాటు మరో రెండింటిలో బలమైన అభ్యర్థులను బరిలో దించే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి .రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలు ఉన్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో పార్టీకి బలమైన పట్టు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థి గెలుపు, ఓటములలో మైనార్టీ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారు. అందులో భాగంగా ముస్లిం సామాజికవర్గం ఓటర్లు ఎవరికి మొగ్గు చూపితే వారినే విజయం వరించనుంది. కాగా.. రాజేంద్రనగర్ నుంచి శాస్త్రిపురం కార్పొరేటర్ మహమ్మద్ ముబీన్, సులేమాన్‌నగర్ కార్పొరేటర్ అబేదా సుల్తానా భర్త నవాజుద్దీన్, అహ్మద్‌నగర్ కార్పొరేటర్ సోదరుడు గోల్డెన్ హైట్స్ కాలనీ నివాసి సర్ఫరాజ్ సిద్ధిఖీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.