- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మతం చూసి ఎన్ కౌంటర్లు.. నిజామాబాద్‌లో ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: మైనార్టీల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌ల విషయంలో కేంద్రం ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. నిజామాబాద్‌లో గురువారం మాట్లాడిన ఆయన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేంద్రంలోని పెద్దలకు ఇబ్బంది ఏర్పడుతోందని తమ సహాకారం లేకుండానే తెలంగాణ ఇంతలా అభివృద్ధి చెందుతోందా అని తర్జన భర్జన పడుతున్నారని విమర్శించారు.
రాజస్థాన్‌కు చెందిన జునైద్, నసీర్‌లను చంపిన వారిని బీజేపీ ఎందుకు ఎన్ కౌంటర్ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తోందని, చట్టపరమైన పరిపాలనను నిర్వీర్యం చేయాలను చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాము మౌనంగా కూర్చోలేమని ఎప్పటి వరకు మజ్లిస్ సేవకుడిగా అసదుద్దీన్ ఒవైసీ ఉంటాడో అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటాడని అన్నారు. త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో తమ పార్టీకి సహకారం కావాలన్నారు