Atrocious: అర్ధరాత్రి తంగడ్ పల్లిలో దారుణ హత్య..

by Indraja |   ( Updated:2024-06-15 15:06:13.0  )
Atrocious: అర్ధరాత్రి తంగడ్ పల్లిలో దారుణ హత్య..
X

దిశ చేవెళ్ల: చేవెళ్ల మండలం తంగడ్ పల్లి గ్రామానికి చెందిన రూల ఖాన్(58) తన ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి తరువాత 2 నుంచి 3 గంటల ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు బైక్, స్కూటీలపై వచ్చి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇంట్లో గొడవ జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

రాత్రి సమయం వాళ్ళు గ్రామంలోకి వచ్చి వెళ్ళుతున్న సయమంలో గ్రామస్తులు పట్టుకునేందుకు యత్నించగా హంతకులు తప్పిoచుకున్నారు. అయితే హంతకులు వారు వచ్చిన వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లారు. కాగా వీరు నగరం నుంచి వచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు నగరంలో ఉంటారు. ఇక్కడ రూలఖాన్ ఒకరే ఉండడంతో హంతకులు చంపి వెళ్లారు.

సొంత అల్లుడు ఈ ఘతుకానికి పాల్పడినట్లు విశ్వనీయ సమాచారo. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed