Chief Secretary : ప్రజాపాలన విజయోత్సవాల ముగింపుపై సీఎస్ శాంతి కుమారి సందేశం..

by Ramesh N |
Chief Secretary : ప్రజాపాలన విజయోత్సవాల ముగింపుపై సీఎస్ శాంతి కుమారి సందేశం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన (Praja Palana) ప్రజాపాలన విజయోత్సవాలు నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా మంగళవారం (CS Santhi Kumari) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఎక్స్ వేదికగా ఒక సందేశం విడుదల చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు సీఎస్ శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, సహకరించిన సిబ్బంది, కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు సీఎస్ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story