- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కీలక పరిణామం.. కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ లేబర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షులు రమేష్, ఆయనతో పాటు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. లేబర్ పార్టీని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సూచన మేరకు విలీనం చేసుకున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. లేబర్ పార్టీ నాయకులకు కాంగ్రెస్‌లో తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.