- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్పీడీసీఎల్‌లో సిరిసిల్ల ‘సెస్’ విలీనం.. ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ కమిషన్ సిఫారసు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడా లేని తీరులో సిరిసిల్లలో మాత్రమే పని చేస్తున్న సెస్ (కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ లిమిటెడ్) సంస్థ నిర్వహణలోని ఆర్థిక అవకతవకలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్.. ఆ సంస్థను మూసి వేయాలని, ఉత్తర డిస్కంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సంస్థ నిర్వహణకు సంబంధించి వచ్చిన ఆరోపణలు, ఆడిట్ రిపోర్టులోని లోపాలను విశ్లేషించిన కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఏడేండ్ల (2016-22) కాలంలో ఆ సంస్థ నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలను, ఆడిట్ రిపోర్టులను కమిషన్ లోతుగా పరిశీలించింది. ఈ సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కమిషన్ తరఫున సెక్రటరీ ఈ సిఫారసులను గురువారం ప్రభుత్వానికి అందజేశారు.
డొమెస్టిక్ మొదలు ఇండస్ట్రీస్ వరకు జారీ అయిన పవర్ కనెక్షన్‌లు, వాటి బిల్లులు, జరిగిన పేమెంట్స్.. ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావించి విద్యుత్ నష్టాలను నివారించడానికి ఆ సంస్థను పూర్తిగా క్లోజ్ చేయడమే శ్రేయస్కరమని పేర్కొన్నారు. సెస్ నిర్వహణలోని కొన్ని అంశాలను కార్యదర్శి వివరిస్తూ.. 2014-22 మధ్యకాలంలో సుమారు రూ.94.88 కోట్ల మేర లీకేజీ చోటుచేసుకున్నదని, ఇందులో రూ.23.77 కోట్లు హెచ్‌టీ కనెక్షన్ టారిఫ్ ప్రకారం వసూలు చేయడానికి బదులుగా ఎల్‌టీ కేటగిరీలో చేర్చారని, మరో రూ.22.16 కోట్ల మేర కొన్ని కనెక్షన్‌లను క్లబ్ చేయకుండా వదిలేయడం ద్వారా జరిగిందని వివరించారు. సెస్ ఆస్తుల విషయంలోనూ రూ. 59.54 కోట్ల మేర లోపాలు ఉన్నట్లు ప్రస్తావించారు.
చిన్నతరహా పరిశ్రమల కింద ప్రభుత్వం నుంచి చేనేత పరిశ్రమలకు విద్యుత్ వినియోగంలో రాయితీ కల్పించిందని, ఆ ప్రకారం కేటగిరీ-4 ప్రకారం చార్జీలను వసూలు చేయాల్సి ఉన్నదని, కానీ ఆ తర్వాత కోర్టు కేసు కారణంగా దాన్ని కేటగిరీ-3లోకి చేర్చి 2016 ఏప్రిల్ 1 నుంచి వసూలు చేయాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయని, కానీ ఇది షమలు చేయని కారణంగా రూ.38 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని కార్యదర్శి ఆ లేఖలో ఉదహరించారు. వినియోగానికి తగినట్లుగా ఆ పరిశ్రమల నుంచి డిపాజిట్లు సేకరించలేదన్నారు. అదనపు వినియోగ డిపాజిట్ వసూలు చేయనందున రూ.10.48 కోట్ల మేర విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందన్నారు. అన్ రెగ్యులరైజడ్ మెటీరియల్ ఖాతాలో రూ. 60 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు.
సెస్ సిబ్బందికి టీఏ (ట్రావెలింగ్ అలవెన్స్) పేరుతో అర్హత లేనివారికీ వర్తింపజేయడంతో సుమారు రూ. 2.90 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆడిట్ రిపోర్టులో వెల్లడైనట్లు కమిషన్ సెక్రటరీ తన నివేదికలో ప్రభుత్వానికి వివరించారు. విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిమ్మని ప్రకాశ్ ఈ-మెయిల్ ద్వారా కమిషన్‌కు పంపిన ఫిర్యాదులో సెస్ నిర్వహణ, అందులోని ఉద్యోగులపై పలు ఆరోపణలు చేశారని పేర్కొని దాని కాపీని కూడా ప్రభుత్వానికి పంపారు. భారతీయ కిసాన్ సంఘ్ (సిరిసిల్ల) తరఫున ద్యాప దేవయ్య, జి.గణేశ్ ఈ నెల 12న ఒక మెమొరాండం ఇచ్చారని, అందులో సెస్‌లోని చాలా మంది ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడ్డారని, సంస్థ నిర్వహణ అనుమానాలకు తావిచ్చేదిగా ఉన్నదంటూ ఆరోపించారని కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సెస్ సంస్థను పూర్తిగా క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు దీన్ని ఉత్తర డిస్కం కంపెనీలో విలీనం చేయడంపై నిర్ణయం తీసుకోవాలని, రెవెన్యూ నష్టాన్ని నివారించడానికి ఈ చర్య సమంజసంగా ఉంటుందని కమిషన్ సెక్రటరీ గురువారం తన నివేదికలో ప్రస్తావించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి వీలవుతుందన్నారు. ఇదిలా ఉండగా 2022 డిసెంబరులో జరిగిన సెస్ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కేటీఆర్ తన అనుచరులను గెలిపించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ సంస్థ నిర్వహణపైనే ఆరోపణలు రావడం, ఆడిట్ రిపోర్టులో అవకతవకలు రావడంతో ఎలక్ట్రిస్టీ రెగ్యులేటరీ కమిషనే చొరవ తీసుకుని ప్రభుత్వంలో విలీనం చేయాలని సిఫారసు చేయడం గమనార్హం.