- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులను లైట్ తీసుకున్న కేసీఆర్.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కనిపించని ప్రస్తావన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ విడుదల చేశారు. రైతులు, మహిళలు, జర్నలిస్టులు, ఉద్యోగులు, బీసీలు, దళితులకు పలు హామీలు ప్రకటించగా.. మేనిఫెస్టోలో నిరుద్యోగుల ప్రస్తావన కనిపించలేదు. నిరుద్యోగులకు అసలు ఒక్క హామీ కూడా ప్రకటించలేదు. కొత్త ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు సాయం గురించి మేనిఫెస్టోలో అసలు ప్రస్తావనే లేదు. నిరుద్యోగులకు టీ కాంగ్రెస్ ఇప్పటికే పలు హామీలు ప్రటించింది. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతితో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ వంటి హామీలను యూత్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించింది.
కాంగ్రెస్‌కు పోటీగా రైతుబంధు పెంపు, రూ.400కే గ్యాస్ సిలిండర్ , మహిళలకు నెలకు రూ.3 వేల భృతి వంటి హామీలు ఇచ్చిన కేసీఆర్.. నిరుద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఒక్క అంశాన్ని కూడా పొందుపర్చలేదు. దీనిని బట్టి చూస్తే నిరుద్యోగులను కేసీఆర్ లైట్ తీసుకున్నట్లు అర్థమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసినా ఎన్నికల వల్ల ఎగ్జామ్స్ అన్నీ వాయిదా పడటంతో అభ్యర్థులు నిరాశలో కూరుకుపోయారు.
గ్రూప్-2, డీఎస్సీతో పాలు పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతనే పరీక్షలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ సెంటర్లలో చేరిన అభ్యర్థులందరూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. పరీక్షలు వాయిదా పడటంతో ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో వ్యతిరేకత కనిపిస్తుండగా.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో వారికి ఒక్క హామీ కూడా ఇవ్వలేదు.