Breaking: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్.. కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్‌కు మెగాస్టార్..!

by srinivas |
Breaking: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్.. కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్‌కు మెగాస్టార్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Icon Star Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్పా-2 మూవీ(Pushpa-2 Movie) రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్(Hyderabad Sandhya Theatre) వద్ద జరిగిన తొకిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌(Chikkada Palli Police Station)కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ను కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసుల రెడీ అవుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌లో ఉన్న ఆయన.. రద్దు చేసుకుని హుటాహుటిన బయల్దేరినట్లు సమాచారం. చిరంజీవీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed