- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాసంగి పంట కాలంపై శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులతో సమావేశం
దిశ , తెలంగాణ బ్యూరో : యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కోరింది . ఈ మేరకు బుధవారం సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో యాసంగి వరి పంట కోతల ఆలస్యం మూలంగా అకాల వర్షాలతో జరిగే నష్టంపై చర్చించేందుకు ఈ మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసారు. తదుపరి సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, నిపుణులకు మంత్రులు సూచించారు. అలాగే యాసంగి సాగులో యాజమాన్య పద్దతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగుపై , ఇతర అంశాలపై కుడా ఈ సమావేశంలో విస్తృత చర్చించారు. గత క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి , రైతాంగానికి జరుగుతున్నా నష్టని నివారించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలనకు వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది . ఈ మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు .