- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TS: రేకుల షెడ్డులో ‘మెడికల్ కౌన్సిల్’
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త మెడికల్ కాలేజీలు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం... మెడికల్ కౌన్సిల్ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. కౌన్సిలర్ భవనం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ ఆఫీసర్లు కూడా తమకేమీ సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కౌన్సిల్ కు వచ్చే డాక్టర్లు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించే వారు కరువయ్యారు. కనీసం వాష్ రూమ్, వాటర్ ఫెసిలిటీ కూడా లేవంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ కౌన్సిల్ కు ఒకే రోజు యాభై మంది డాక్టర్లు వస్తే కూర్చునేందుకు కుర్చీలు కూడా సరిపోవు. వైద్యవ్యవస్థను బలోపేతం చేస్తున్నామంటూ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటున్నదే తప్పా.. డాక్టర్ గా గుర్తింపు పొందాల్సిన ఆఫీస్ ను మాత్రం చక్కదిద్దడం లేదు. దీనిపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్వరలో మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. పోటాపోటీగా డాక్టర్లు ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం, కౌన్సిల్ టీమ్ కొత్త భవనాన్ని నిర్మించేందుకు చొరవ చూపడం లేదు. దీంతో హెచ్ఆర్ డీఏ ప్యానెల్ కొత్త బిల్డింగ్ ను నిర్మిస్తామని డాక్టర్ల ఎన్నికల మేనిఫెస్టోలో కీలక అంశంగా పొందుపరిచింది. దీన్ని బట్టి మెడికల్ కౌన్సిల్ కు నూతన భవనం ఎంత అవసరమో అర్థమవుతున్నది.
ఇతర రాష్ట్రాల్లో స్పెషల్ బిల్డింగ్స్
ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయాలు అద్బుతంగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం రేకులు షెడ్డులో ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కౌన్సిల్ లో ఒకే నామినేటెడ్ బాడీ ఉండటం వలన ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఐఎంఏ డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ.. కౌన్సిల్‌ను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి నామినేటెడ్ అయిన సభ్యులు కొత్త బిల్డింగ్ కోసం కృషి చేయాలని డాక్టర్లు కోరుతున్నారు.
నిధులున్నా..!
డాక్టర్ల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్, స్టాండర్ట్ సర్టిఫికెట్, ఎన్వోసీ, సీఎంఈ తదితర ప్రాసెస్ కు డాక్టర్లు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. గత 17 ఏళ్ల నుంచి కౌన్సిల్ ఫండ్స్ బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయని ఓ డాక్టర్ తెలిపారు. వాటిని హైదరాబాద్ బ్యాంకులో కాకుండా నిజామాబాద్ జిల్లా లోని బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిసింది. కౌన్సిల్‌లోని పాత చైర్మన్ వాటిని అక్కడ డిపాజిట్ చేయించినట్లు సమాచారం.