విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలి

by Sridhar Babu |
విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి సాంబశివరావు అన్నారు. బుధవారం పెద్ద పల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే యువ వికాసం సభ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాలో గ్రూప్ 4లో ఉత్తీర్ణలైన 511 మంది అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయం నుంచి బస్సులో బయలుదేరి వెళ్లారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద బస్సులకు సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు.

అభ్యర్థుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సుకు ఒక కానిస్టేబుల్, ఒక లైజన్ అధికారిని కేటాయించడంతోపాటు బస్సులన్నింటికి ఒక సమన్వయ అధికారిని నియమించినట్లు సాంబశివరావు వివరించారు. అంతే కాకుండా వీరికి కొత్తపల్లి దగ్గర మధ్యాహ్న, రాత్రి భోజనాల వసతి కూడా కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు బాధ్యతాయుతంగా అంకితభావంతో పని చేయాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకౌంట్స్ అధికారి రామ్మెహన్, ఎస్సీ కార్పొపరేషన్ ఈడీ బాబు మోసిస్, డీటీఓ వెంకటేశ్వర్లు, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed