- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తొక్కిసలాటలో మహిళ మృతి.. హీరో అల్లు అర్జున్, పోలీసులే బాధ్యత వహించాలని కుటుంబ సభ్యుల డిమాండ్

దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2 (Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్(RTC Cross Road)లోని సంద్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట(Stampede) జరిగింది. పరిమితికి హీరో అల్లు అర్జున్(Allu Arjun) వస్తున్నాడని వార్తలు రావడంతో వేల సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. దీంతో ఒక్కసారిగా ఉదృక్త వాతావరణం నెలకొని తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన తల్లి కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ క్రమంలో మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు మీడియాతో స్పందించారు.
మృతురాలి భర్త మాట్లాడుతూ.. ఎంతో ఆనందంగా సినిమా చూడటానికి వచ్చామని.. హీరో అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిందని, తాను తన కూతురితో కలిసి పక్కకు వెళ్లానని, తన బాబు, భార్య కనిపించలేదని పోలీసులను అడిగానని, తీరా చూస్తే.. నా భార్య చనిపోయిందని కొడుకు పరిస్థితి కూడా 48 గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమంటున్నారని.. కన్నీటి పర్యాంతం అయ్యాడు. అనంతరం అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్, అతని ఫ్యాన్స్, సోషల్ మీడియా, పోలీసులు బాధ్యత వహించాలని.. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాలుడికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
Read More : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఒకరు మృతి, బాలుడి పరిస్థితి విషమం
- Tags
- allu arjun