- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మహిళా అభివృద్ధే సామాజిక అభివృద్ధి'
దిశ, అల్వాల్: సమాజ పురోగమణంలో స్త్రీల పాత్ర ఎంతో ఉన్నతమైనదని అల్వాల్ సర్కిల్ డిప్యూటి కమిసనర్ నాగమణి అన్నారు. బుధవారం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని రకాల అడ్డంకులను అదిగమించి ముందుకు పోవడమే మహిళల కర్తవ్యం అన్నారు.
పతంజలి యోగా సెంటర్ లో....
అల్వాల్ పతంజలి యోగా హెల్త్ కేర్ సెంటర్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాలలో సమాన భాగస్వామ్యానికి పోరాడుతూనే మహిళలు ఆరోగ్య సమస్యల పట్ల తగిన శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇళ్లంతా ఆరోగ్యాంగా ఉన్నట్లేనని తెలిపారు. అందుకు ప్రతి మహిళ ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పారిశుద్ద కార్మికులను సన్మానించిన కార్పొరేటర్ సబిత...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిశోర్ గౌడ్ కేక్ కట్ చేసిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను భూదేవినగర్ పార్టీ కార్యాలయంలో శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రామిక వర్గ మహిళలతోనే ఈ సమాజం ముందుకు పోతుందని తెలిపారు. అందుకు మహిళలుగా మనకు ఎంతో గర్వకారణం అన్నారు. సాధించిన హక్కులను కాపాడుకుంటునే సాధించుకోవలసిన అహక్కులకు ఉద్యమిద్దామన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో....
మహిళ హక్కుల సాధనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ అల్వాల్ సర్కిల్ అధ్యక్షురాలు వీనస్ మేరీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలకు నందికంటి హాజరై పలువురు మహిళనలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళ శక్తియుక్తులు కాంగ్రెస్ పార్టీకి తెలుసన్నారు. వారి హక్కుల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడు ముందుంటారన్నారు. ఒక ఇందిరాగాంధీ, సోనియా గాంధీ దేశ్నానికి దశ దిశను చూపిన వారన్నారు. వారి స్ఫూర్తితో ఎదుగుతున్న నూతన మహిళా శ్రేణులు సామాజిక అభివృద్ధిలో ముందుండాలన్నారు.