MLA Marri Rajasekhar Reddy : మహిళలు అంతర్జాతీయ క్రీడాపోటీలలో మరింత రాణించాలి..

by Sumithra |
MLA Marri Rajasekhar Reddy : మహిళలు అంతర్జాతీయ క్రీడాపోటీలలో మరింత రాణించాలి..
X

దిశ, అల్వాల్ : మహిళలు అన్నిరంగాలతో పాటు అంతర్జాతీయ క్రీడా రంగాల్లో సైతం రాణించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేకర్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో ఇటీవల జూలై 18వ తేదీ నుంచి 23 వరకు దక్షణ కొరియాలో నిర్వహించిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలలో స్వర్ణం, కాంస్యం పథకాలు సాధించిన డోలి పవిత్రను ఎమ్మెల్యే అభినందించారు.

అనంతరం మాట్లాడుతూ ఉద్యోగ వ్యాపార రంగాలతో పాటు నేటి ఆధునిక యుగంలో ఉనికిలో ఉన్న అన్ని రంగాల్లో రాణించవలసిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటును ఉపయోగించుకుని కీడారంగంలో పవిత్ర లాంటి మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో డోలి రమేష్, బద్దం పరుశురాం రెడ్డి, వెంకన్న, డోలి సుధీర్, కృష్ణవేణి, నాగ భవాణి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed