- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోడుప్పల్ సర్వసభ్య సమావేశంలో వక్ఫ్ బోర్డ్ బాధితుల నిరసన..
దిశ, మేడిపల్లి: వక్ఫ్ బోర్డు బాధితులు సర్వసభ్య సమావేశంలో ప్రవేశించి సమావేశాన్ని అడ్డుకొని, తమ సమస్యపై తీర్మానం చేయాలంటూ బైఠాయించిన సంఘటన బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా తమ భూములు కాపాడుకోవడానికి పోరాడుతున్న వక్ఫ్ బోర్డు బాధితులు బుధవారం జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో తమ సమస్యపై సభ్యులందరూ తీర్మానం చేసి సంబంధిత మంత్రులకు అధికారులకు పంపించాలంటూ సమావేశంలోకి ప్రవేశించి, సమావేశంలో మేయర్ అధికారితో వాగ్వివాదానికి దిగారు.
తమ సమస్య పరిష్కరించే వరకు వెళ్ళేది లేదంటూ సమావేశంలో బైఠాయించారు. ఇంత పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేస్తున్నా ఒక్క నాయకుడు కూడా తమ గోడు వినడం లేదని వాపోయారు. ఎందరో మంత్రులను అధికారులను కలిసిన లోకల్ కౌన్సిల్ తీర్మానం చేసారా అంటూ అడుగుతున్నారని, దీనిపై వెంటనే తీర్మానం చేసి సంబంధిత అధికారులకు తీర్మానం పంపించి తమ సమస్య పరిష్కారమయ్యే విధంగా సహకరించాలని కోరారు.
సమావేశంలో కొద్దిసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో స్పందించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి ఇంతకుముందు కూడా తీర్మాన పత్రం అధికారులకు పంపించామని, ఇప్పుడు కూడా మరల తీర్మానం చేసి పంపిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన వక్స్ బాధితులు తీర్మానం చేసే వరకు సమావేశం ఆరుబయట నిరసన వ్యక్తం చేశారు. మేయర్ వచ్చి తీర్మానం చేసిన పత్రాలు చూపించే వరకు ఉండి తమ సమస్యను పరిష్కరించే వరకు కృషి చేయాలని కోరారు. ఇప్పటికైనా మేయర్ కౌన్సిల్ సభ్యులు స్పందించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.