రియల్ మాయ.. అందమైన బ్రోచర్లతో బురిడీ

by Anjali |
రియల్ మాయ.. అందమైన బ్రోచర్లతో బురిడీ
X

దిశ, మేడ్చల్ బ్యూరో: అందమైన చిత్రాలు.. ఆకట్టుకునే బ్రోచర్లు.. వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ అందిస్తామంటూ ‘లక్ష్మీ శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్’ సంస్థ కొనుగోలు దారులను బురిడీ కొట్టించింది. ఫ్రీలాం చ్ ఆపర్లకు బదులుగా స్పెషల్ లాంచ్ ఆఫర్లంటూ పెద్ద సంఖ్య లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఆకర్షించింది. రెరా, హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోకుండానే వందలాది అక్రమ విల్లాలను నిర్మించింది. ప్రత్యేక రాయితీలను చూసి అక్రమ విల్లాలను కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు.

నిబంధనలు హుష్ కాకి..

పట్టణ ప్రణాళిక నిబంధనలను తుంగలో తొక్కి ‘లక్ష్మి శ్రీనివాస్’ నిర్మాణ సంస్థ 260 విల్లాలను నిర్మించింది. బ్రోచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంది. విల్లాల నిర్మాణం పూర్తి కాక ముందే ఫ్రీలాంచ్ పేరిట వందల కోట్ల వ్యాపారాన్ని చేపట్టింది. ట్రిప్లెక్స్ విల్లాను హెచ్ఎండీఏ అనుమతులతో 2,399 చదరపు అడుగుల్లో నిర్మించినట్లుగా, నాలుగు బెడ్ రూములు, హాల్, కిచెన్ ఉన్నా విల్లాకు రూ.1.43 కోట్లు, పంచాయతీ అనుమతులతో 2100 చదరపు అడుగులతో నిర్మించినట్లుగా చెబుతున్న విల్లా (మూడు బెడ్ రూములు, హాల్, కిచెన్)కు రూ.1.10 కోట్లుగా నిర్ణయించారు. మౌలిక సదుపాయాల కోసం అదనంగా మరో రూ. 6 లక్షలు చెల్లించాలని అంది. ఇలా ఇప్పటికే 90 శాతం విల్లాలను విక్రయించింది.

ఈ గేటెడ్ కమ్యూనిటీ కాల నీలో పార్కు లేదు. ఉన్న పార్క్ స్థలాలను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించించారు. చిల్డ్రన్స్ పార్కులో ఆట వస్తువులను ధ్వం సం చేయించారు. అడ్డు వచ్చిన కాలనీ వాసులపై పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించారు. విల్లాల మధ్య 30 అడుగుల రోడ్డు లేదు. మురుగు నీరంతా పక్కనే ఉన్న కాత్వ చెరువులో కలిసేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విద్యుత్ అధికారులు అండర్ గ్రౌండ్ కేబుల్ సౌకర్యాన్ని కల్పిం చడం గమనార్హం. 260 విల్లాల కు 500 కేవీ సామర్థ్యం గల ఒ కటే ట్రాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. అక్రమ విల్లాలకు సహకరించినందుకు ప్రజాప్రతినిధులు, అధికారులకు భారీ నజరానాలు ముట్టినట్లు సమాచా రం. ఈ ప్రాజెక్టు పేరు మీద స్థానికంగా కొందరు ప్రజా ప్రతినిధులు ముడుపులు, తమ బం ధువుల పేరుతో విల్లాలను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

వసతుల కోసం అడిగితే కేసులు

నిర్మాణ సంస్థ కొనుగోలు సమయంలో అందమైన బ్రోచర్ చూపించి నట్టేట ముంచారని జీఎల్‌సీ భావనా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సాయికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమినిటీస్ కోసం అడిగినుందుకు పార్క్ స్థలం అమ్మితే అడ్డువస్తున్నాన్న నేపంతో నాపై పోలీస్ స్టేషన్‌లో 8 తప్పుడు కేసులు బనాయించారు. రూ. కోట్లు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేశామని నెల నెలా లక్షల రూపాయలు బ్యాంక్ లో ఇన్‌స్టాల్‌మెంట్ కడుతున్నా ఎటువంటి సౌకరాలు లేవన్నారు. లక్ష్మీ శ్రీనివాస్ నిర్మాణ సంస్థ ఓనర్ విజయలక్ష్మి సౌకర్యాలు కల్పించకపోగా ప్రభుత్వ స్థలంలో తప్పుడు పత్రాలతో కట్టినా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు.

-సాయి కృష్ణ, జీఎల్‌సీ విల్లాల మాజీ అధ్యక్షుడు

కనీస సౌకర్యాలు కల్పించడం లేదు

రూ. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన తర్వాత అనుమతులు లేవని తెలిసింది. ఎమినిటీస్ గురించి అడితే బిల్డర్ మొహం చాటేశారు. అనుమతులు లేకపోవడంతో తాగు నీరు, డ్రైనేజీ, వీధిలైట్లను ము న్సిపల్ అధికారు లు కల్పించడంలేదు. మున్సిపల్ కార్యా ల యం నుంచి హౌస్ నెంబర్ తీసుకొని ప్రతీ సంవత్సరం ఇం టిపన్ను చెల్లిస్తు న్నాం. అయినా కనీస సౌకర్యాలు కల్పించడంలేదన్నారు. 200 విల్లాలకు ఒకే ట్రాన్స్ ఫార్మర్ ఉండడం వల్ల విద్యుత్ సమస్యతో గ్రోహోపకరణాలు పాడవుతున్నాయి.

- వెంకట్, జీఎల్సీ భావనా అసోసియేషన్ మాజీ సెక్రటరీ

Advertisement

Next Story

Most Viewed